నా సాక్ష్యం
నా పేరు కే. ఎలిజబత్తమ్మ. నా తల్లి పేరు అప్పాయమ్మ . తండ్రి పేరు తొ ట య్య . మేము హిందూ కుటుంబము నుండి వచ్చాము.
నాకు ఒకసారి రక్త బట్టల వ్యాధి వచ్చింది. అది 10.1985 నెలలో వచ్చింది. నేను ఎన్నో పూజలు పునస్కారములు చేసాను. ఎన్నో విగ్రహాలకు మొక్కాను. కాని నాకు వ్యాది తగ్గలేదు. ఒక సహోదరి నా వద్దకు వచ్చి,యేసు క్రీస్తును తెలుసుకొని నమ్మి, ప్రార్ధన చెయ్యి వ్యాది తగ్గుతుంది అని చెప్పింది. అప్పటినుండి నేను దేవుని మందిరానికి వేల్లుచున్నాను. చావు బ్రతుకుల మద్య వ్రేలాడుతున్న నన్ను గూర్చి పాస్టరు గారు ప్రార్ధన చేయగా, నాకు 10 నెలల నుండి స్రవిస్తున్న రక్త బట్టల వ్యాధి ఒక దిన ప్రార్ధనలో వెంటనే స్వస్తత వచ్చింది కొన్ని దినాలకు (8.7.1988) కి బాప్తిసం పొందాను.
తరువాత దేవుడు నాతొ మాట్లాడాడు. అప్పటినుండి నేను ప్రభువు సేవలో ముందుకు సాగుతున్నాను.
కావున సహోదరి మరియు సహోదరుడా. మీరు యేసును అంగీకరించారా! యేసుని గురించి తెలుసుకున్నారా! లేకుంటే ఇప్పుడే ఆయనను తెలుసుకొని మారుమనస్సు పొంది, రక్షణ పొందండి. ఇదే అనుకూల సమయము. ఇదే రక్షణ దినము. ఏసుక్రీస్తు అందరికి ప్రభువు. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులైన మనలను నీతిమంతులుగా తీర్చును. దేవుని యందు స్త్రీ, పురుషుడు, చిన్న, పెద్ద, ధనిక, పేద, కుల, మతం అన్న తేడ లేదు. అందరు ఒక్కటే ఏసుక్రీస్తు నందు మనమందరమూ ఏకముగా ఒక్కటిగా ఉన్నాము.
Your sister in Christ,
(Sis K. Elizabethamma)
(Sis K. Elizabethamma)
Satellite city, ‘C’ Block,
Rajahmundry (Rural)
E.G.Dist., A.P., S.India


No comments:
Post a Comment